కలుపు నివారణ అంతరకృషి :
వర్షాకాలంలో రెండుసార్లు తోటంతా దున్నడం వలన కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాననీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షం తరువాత అట్రాటాఫ్ ఎకరకు 80౦ గ్రా. 24౦ లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. తరువాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు నివారణకు గ్లైసేల్ లేదా రౌండప్ కలుపు మందును కలిపి దానితోపాటు 20 గ్రా. అమ్మోనియం సల్ఫేట్ గాని, 10 గ్రా. యురుయా కలిపి 20 -25 రోజుల కలుపు పై పిచికారి చేయాలి. ఈ మందు వాడేటప్పుడు చిన్న వయసు పండ్ల మొక్కల మిధ పడకుండ జాగ్రత్త వహించాలి. (చీని, నిమ్మ, ద్రాక్ష, జామ, సపోట, దానిమ్మ, రేగు, సీతాఫలం, పండ్లతోటల్లో కూడ ఇదే విధంగా కలుపు నివారించవచ్చు. )